![]() |
![]() |
ఇప్పుడు సినిమాల కంటే బిగ్‌బాస్ గురించిన చర్చ బాగా పెరిగిపోయింది. ఈ రియాలిటీ షోకి మంచి క్రేజ్ వచ్చింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఇప్పుడు సెలబ్రిటీలు అయిపోయారు. బిగ్‌బాస్ నియమనిబంధనల ప్రకారం తోటి కంటెస్టెంట్లతో అసభ్యంగా ప్రవర్తించకూడదు. వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు. ఒకరిపై ఒకరు దాడి చేయకూడదు.. ఇలా రూల్స్ ఎన్నో ఉన్నాయి. అయితే మనవాళ్ళు రూల్స్ పాటించరు కాబట్టి బిగ్‌బాస్ హౌజ్‌లో ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. తోటి ఇంటి సభ్యుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందని బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై అట్రాసిటి కేసు నమోదైంది. కన్నడ బిగ్‌బాస్ షోలో ఓ లేడీ కంటెస్టెంట్ నోరు జారి మాట్లాడినందుకు ఆమెపై అట్రాసిటీ కేసు నమోదైంది. కన్నడ బిగ్ బాస్ సీజన్ 10 నడుస్తోంది. ఈ షోలో నటి తనీషా కుప్పండ కంటెస్టెంట్‌గా పాల్గొంది.
తన తోటి సభ్యులతో ఎప్పుడూ తనీషా దురుసుగా ప్రవర్తిస్తుందని, అనుచిత వ్యాఖ్యలు చేస్తుందని ప్రచారంలో ఉంది. నవంబర్ 8న ప్రసారమైన ఎపిసోడ్‌లో తోటి కంటెస్టెంట్ డ్రోన్ ప్రతాప్‌ను ‘వడ్డా’ అని పిలిచింది. దీంతో అఖిల కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు భోవి సమాజ్ పి పద్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బెంగుళూరు శివార్లలోని కుంబళగోడు పోలీస్ స్టేషన్‌లో తనిషాపై ఫిర్యాదు చేశారు. వడ్డా అనేది షెడ్యూల్డ్ కులాల విభాగంలోకి వచ్చే భోవి సంఘంలో భాగం. షో సందర్భంగా తనిషా భోవి వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటం ఇది రెండోసారి అంటూ పద్మ వివరించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం కింద తనీషాపై కేసు నమోదు చేశారు.
![]() |
![]() |